కొల్లిపర: పీఎం కిసాన్ యోజనకు అర్హులైన రైతులు ఈనెల 15 లోపు ఈ -కేవైసీ చేయించుకోవాలని ఏఓ వెంకటరావు తెలిపారు. ఈ- కేవైసీ చేయించుకున్న రైతులకే పీఎం కిసాన్ నగదు మంజూరవుతుందన్నారు. ఇందుకు గత నెలాఖరుతోనే గడువు ముగిసినప్పటికీ ఈనెల 15 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కౌలు రైతులకు సీసీఆర్ కార్డుల మంజూరు గడువును కూడా ఈనెల 12వరకు పొడిగించినట్లు తెలిపారు.