కొలంబియాలోని సియెర్రా నెవాడా డి శాంటా మార్టా పర్వతాల్లో సంచరించే పెద్ద హమ్మింగ్‌బర్డ్ 'శాంటా మార్టా సాబ్రూవింగ్' చివరిసారిగా 2010లో కనిపించింది. ఇవి నివసించే అడవులను సాగు కోసం వాడడంతో ఈ పక్షులు ఎటో వెళ్లిపోయాయి. అయితే పదేళ్ల తర్వాత ఈ అరుదైన హమ్మింగ్‌బర్డ్‌ను కొలంబియాలోని పక్షి పరిశీలకుడు యుర్గెన్ వేగా గుర్తించాడు. ఈ జాతి పక్షులను 1946, 2010లో డాక్యుమెంట్ చేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు క్యాప్చర్ చేశారు.