మెటల్ లోడుతో వస్తున్న బెంజ్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మండల కేంద్రమైన భట్టిప్రోలు కు కిలోమీటర్ల దూరంలో లారీ పల్టీ కొట్టింది. మంగళవారం ఉదయం పేరేచర్ల నుండి 40 ఎం. ఎం, మెటల్ తో భట్టిప్రోలు రైల్వే లైన్ పనులకు మెటల్ తెస్తున్న బెంజ్ లారీ తెనాలి - భట్టిప్రోలు రహదారి మార్గంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు.