ఓబులదేవర చెరువు మండల కేంద్రానికి చెందిన బలిజ శ్వేతా అనే అమ్మాయి ఇంటిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ గోపి తెలిపారు. శ్రీనివాసులు కుమార్తె శ్వేత నిత్యం మొబైల్ ఎక్కువగా చూస్తుండడంతో తల్లిదండ్రులు మొబైల్ చూడవద్దని మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.