ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. గుజరాత్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక, తన స్నేహితుడు దీపక్‌తో కలిసి ఢిల్లీకి వచ్చింది. ఆదివారం తిరిగి గుజరాత్ వెళ్లే క్రమంలో వారికి గొడవైంది. ఆమెను వదిలి దీపక్ వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న బాలికపై రైల్వేస్టేషన్లో వాటర్ బాటిళ్లు అమ్ముకునే హర్దీప్, రాహుల్ పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.