ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పని చేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరకగా ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో జరిగింది. అభయ్ నామ్‌దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే నాయకుడి ఇంట్లో పని చేస్తున్నాడు. శనివారం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు.