రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సోసియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కడప నగరంలోని నూతన కలెక్టరేట్, ఆర్ట్స్ కళాశాల దగ్గరలో రోడ్డు కల్వర్టు పనులను హ్యూమన్ రైట్స్ కడప జిల్లా వైస్ ఛైర్మన్ కె. ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్రిడ్జ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో వచ్చి పోయే వాహనాలు ఒకే దారిలో వెళ్లడం జరుగుతోందన్నారు. ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రిమ్స్ కు వెళ్లే మార్గంలో రేడియం స్టిక్కర్ తో నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
రాత్రి సమయంలో అక్కడ వీధి దీపాలు కూడా పని చేయడం లేదన్నారు. దాని వాళ్ళ గమనించకుండా వాహనదారులు వెళ్తూ ఆ ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రమాదాలకు కారణం కావచ్చు అని పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ సమీపంలో రిమ్స్ కు వెళ్లే మార్గంలో నిత్యం వాహనాలు తిరుగుతుంటాయన్నారు. అలా నిత్యం వాహనాలు తిరిగే మార్గంలో, నగరంలో రాత్రిపూట వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో రేడియం స్టిక్కర్ తో నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణం అవుతోందని అన్నారు.
రోడ్డు పనులు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్ తో నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేస్తే రాత్రి సమయాల్లో వెళ్లే వాహనదారులు గమనించి జాగ్రత్తగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని రేడియం స్టిక్కర్ తో కూడిన నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.