ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే లక్ష్యంగ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారి సమస్యల తక్షణ పరిష్కారానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ఈ మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 47 వ వార్డు కార్పొరేటర్ కంటి పాము కామేశ్వరి తో కలిసి సంజీవయ్య కాలనీ కొండవాలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఆయన పర్యటించారు. ఈ మేరకు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ సచివాలయ పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు మెరుగు పరిచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయా పథకాలు నేరుగా లబ్ధిదారులకు అదేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడం తో పాటుగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
అదేవిధంగా పథకాల అమలు ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజల సమస్యలు ప్రజా ప్రతినిధులు నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గత రోజుల నుండి నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టామని కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు వైసీపీ శ్రేణులు కట్టుబడి ఉన్నారన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కి పెద్ద పీట వేస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, షేక్. బాబ్జి, వసంతల అప్పారావు, సుకుమార్, గారకృపారావు, కె. విజయ్, స్వర్ణమని, తదితరులు పాల్గొన్నారు.