తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం శ్రీవారిని 74,830 మంది భక్తులు దర్శించుకోగా 39,405 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు వచ్చిందని తెలిపారు.