భారత్-పాక్ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు 75 ఏళ్లకు కలుసుకున్నారు. మత ఘర్షణలు తలెత్తిన ఆ సమయంలో బాబాయి సర్వాన్ సింగ్ భారత్‌లో ఉండిపోగా, అబ్బాయి మోహన్ సింగ్ తప్పిపోయి పాకిస్థాన్ వెళ్లిపోయాడు. మోహన్ సింగ్‌ను ఓ ముస్లిం కుటుంబం చేరదీసి, పెంచింది. అతడికి అబ్దుల్ ఖాలిక్‌గా పేరు పెట్టింది. ఇక వీరిద్దరు తాజాగా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాలో కలుసుకోవడం చూపరులను ఆకర్షించింది.