వర్షాలు పడటంతో ఏపీలో వజ్రాల వేట మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల శివార్లలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల కోసం అన్వేషిస్తోన్న వేటగాళ్ళతో సందడిగా మారింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గుణపం, పారలతో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అయితే వజ్రాల తవ్వకాలు నిషేధమని చెబుతున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.