ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనుల కోసం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేశారని, పోలవరం ప్యాకేజీని ఇవ్వలేదని చెప్పారు. ఆదివాసీలను నమ్మించి, వంచించారని ఆగ్రహం వ్యక్త చేశారు.