ఇటలీలో రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న స్పానిష్ ప్లూతో చనిపోయింది. ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా మార్చి నైట్రోజన్‌తో నిండిన గాజు సేవ పేటికలో భద్రపరిచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం గమనార్హం. శరీరం, ఎముకలు, అవయవాలు చెక్కుచెదరలేదు. మెదడు పరిమాణం 50% తగ్గిపోయింది. ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది.