2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 'భారత్ జోడో యాత్ర' చేపట్టాలని నిర్ణయించింది పార్టీ అధిష్టానం. అయితే, ఈ యాత్ర అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించాలనుకుంది. కానీ, అంతకంటే ముందుగానే సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర' ప్రారంభం కానుందని ఆ పార్టీ ప్రకటించింది. కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమై కాశ్మీర్‌లో ముగియనుంది.