పాకిస్తాన్ లో దయనీయ స్థితులు నెలకొన్నాయి. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో పాక్ ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. కనీసం మూడు పూటల తిండి కూడా తినలేని దుస్థితిలో ప్రజలు ఉండటంతో పాక్ సర్కార్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పాల ధరలు పెరగడంతో రెండు రోజులకు ఒక పూట మాత్రం టీ తాగుతున్నారు. భోజనం ఖర్చుతో పాటు విద్యుత్ బిల్లు కూడా పేదలకు పెను భారంగా మారడంతో పరిస్థితులు చక్కబడేందుకు పాక్ సర్కార్ చర్యలు చేపడుతోంది.