ఈ రక్షా బంధన్ పండుగ అమెరికా, మారిషస్‌లో నివసిస్తున్న భారతీయులకు భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఆవు పేడతో తయారు చేసిన రాఖీలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులు జైపూర్‌కు చెందిన ఆర్గానిక్ ఆవు పేడ రాఖీలను కట్టుకోనున్నారు. ఈ ఏడాది అమెరికా నుంచి 40,000 రాఖీలకు, మారిషస్ నుంచి 20,000 రాఖీలకు ఆర్డర్లు వచ్చాయని సమాచారం.