ఐఏఎస్ అధికారి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. జైసల్మేర్ కలెక్టర్ టీనాదాబి పేరు, ఫొటోతో పూర్ జిల్లాకు చెందిన దుంగార్ అనే వ్యక్తి వాట్సాప్ ఖాతా తెరిచాడు. అనంతరం ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి ట్రస్ట్ సెక్రటరీ సునీతా చౌదరి వాట్సాప్‌కు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలంటూ సందేశం పంపించాడు. సునీతా చౌదరికి అనుమానం వచ్చి నేరుగా టీనాదాబికే ఫోన్ చేయటంతో విషయం బయటపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa