ఉచితాలపై మాజీ బీజేపీ నేత పిటిషన్ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. సంక్షేమ పథకాల్ని బలోపేతం చేయాల్సింది పోయి.. వాటి పట్ల వ్యతిరేక వాతావరణాన్ని దేశంలో సృష్టిస్తున్నారని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలుగా చూడొద్దని, సమాజంలో సమానత్వం కోసమే ఉచితాలని పేర్కొన్నారు.