పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీర్భం జిల్లాలోని మల్లార్‌పూర్‌లో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళా కూలీలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. పని ముగించుకుని కూలీలంతా ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన 60వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa