బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్తో సమావేశం అనంతరం ఆయన తన రాజీనామాను ధృవీకరించారు.రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించినట్లు తెలిపారు. బీజేపీతో సంకీర్ణ భాగస్వామ్యానికి ముగింపు పలికిన కొద్దిసేపటికే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపింది.. తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం అవుతారని బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.