తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో కూడా వ్యాపార పరంగా తెలిసిన పేరు గాలి జనార్దన్ రెడ్డి. అవినీతి కేసులో జైలుకి వెళ్లి తాను చేస్తున్న మైనింగ్ బిజినెస్ కూడా ప్రభుత్వం నిలిపివేసింది.
తాజాగా మళ్ళి తెర మీదకి ఈ పేరు వచ్చింది. ఈ విషయంపై స్పందించిన టీడీపీ నాయకులూ మాట్లాడుతూ.... దేశంలోనే అతిపెద్ద అవినీతి గనిగా పేరుబడ్డ గాలి జనార్దన్ రెడ్డి ఎదిగింది ఓబుళాపురం మైనింగ్ తోనే.
అప్పటి వైఎస్ సర్కార్ ఇతగాడి అవినీతికి అండగా నిలిచింది. ఇద్దరూ కలిసి మూటకట్టుకున్నది ఒక్క డబ్బునే కాదు. అంతులేని పాపాన్ని కూడా. ఇప్పుడు జగన్ రెడ్డి మళ్ళీ ఆ 'గాలి'కి ఏపీలో చోటిస్తున్నాడు అని అన్నారు. దీనికి కారణం గాలి జనార్దన్ రెడ్డి కి మళ్ళి మైనింగ్ అవకాశాలు ఇవ్వడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పటమే.