గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకుండా హోంమంత్రి కుట్ర అని మాట్లాడతారా? అని ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత . గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఆమె స్పందిస్తూ... మాధవ్ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే.. హాలిడే కావడంతో అధికారులు లేరని చెప్పారు.
అంబటి, అవంతిపై చర్యలు తీసుకుని ఉంటే మాధవ్ ఘటనపై ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చేది కాదు. న్యూడ్ వీడియో ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు మహిళా జేఏసీ తరపున ఫిర్యాదు చేస్తాం. హోంమంత్రిగా ఎలా పనిచేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చోవాలి. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత హోంమంత్రి బయటికొచ్చి ఇప్పుడు కుట్ర అని మాట్లాడతారా? 24 గంటలు పనిచేయాల్సిన పోలీసుశాఖ సెలవు తీసుకుంది. రాజకీయ కుట్ర అని హోంమంత్రి ఎలా చెప్తారు? వెకిలి వేషాలేస్తోన్న ఎంపీపై చర్యలు తీసుకోకుండా ఎంపీని వెనకేసుకు రావడానికి హోంమంత్రికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.