కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ నిండుతోంది. రిజర్వాయర్ ఇన్ ఫ్లో పెరగడంతో 6 గేట్లను ఎత్తి రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు కూడా వరద వస్తుండటంతో 30 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.