మాధవ్ వీడియో వాస్తవమా? కాదా? అన్నది తేల్చడానికి అరగంట చాలని టీడీపీ నేతలు అంటున్నారు. మరి 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు రేవంత్రెడ్డి ద్వారా రూ.50 లక్షలు ఇచ్చి పంపారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా మాట్లాడారు. అందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి అని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు.
ఇక్కడ ఒక ఎంపీకి (గోరంట్ల మాధవ్) సంబంధించి మాట్లాడిన వీడియోకాల్ వేరే ఫోన్లో రికార్డు చేశారు. అందులో ఎవరున్నారో తెలియదు. ఎవరు రికార్డు చేశారో తెలియదు సరైన పద్దతిలో విచారణ చేపట్టి తర్వాత అది నిజమే అని తెలిస్తే తప్పకుండ చర్యలు తీసుకుంటాం అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.