అన్నమయ్య జిల్లా, నందలూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు రేంజ్ డి.ఐ.జి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐ.పి.యస్ .
నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రతి శుక్రవారం పరేడ్ నిర్వహించాలన్నారు.
ప్రతివారం మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాలలో డ్రగ్స్, బాల్య వివాహాలు, దిశయాప్, మహిళలపై జరిగే నేరాలు, ఆన్ లైన్, సైబర్ మోసాలు తదితర విషయాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు ,మహిళ పోలీసులు బాగా పనిచేసి లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని సూచించారు.
అపార్ట్మెంట్ లు, షాపుల్లో సి.సి కెమెరాల ప్రాముఖ్యత వివరించి వాటిని అమర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.