పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి? వైసీపీ రాక్షసపాలనలో పోలీసుల ప్రాణాలకీ రక్షణలేకుండా పోయింది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ వాపోయారు. వివరాల్లోకి వెళ్ళితే..... నంద్యాల డీఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ ని పట్టణం నడిమధ్యలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు రౌడీషీటర్లు.
ఈ విషయం మీద స్పందించిన లోకేష్ మాట్లాడుతూ.... జగన్రెడ్డి రాజ్యం నేరగాళ్ల స్వర్గమైందని రౌడీషీటర్లు నిరూపించారు. ఒక కాకి చనిపోతుంది సాటి కాకులు అరుస్తూ గోల చేస్తాయి. ఒక ఖాకీని చంపేస్తే.. నిందితులైన రౌడీషీటర్లు ఎవరో తెలిసినా ఇప్పటికీ ఖాకీ బాస్లు పట్టుకోలేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో తేటతెల్లం అవుతోంది.
కానిస్టేబుల్ సురేంద్రకుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు.