మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం బుధవారం జరగనున్నది. ఆధునికీకరించిన కౌన్సిల్ హాల్‌లో ఉదయం 10. 30 గంటల నుంచి మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. ఇందుకోసం 12 అంశాలతో ప్రధాన, సప్లిమెంటరీ అజెండాలను తయారుచేశారు. వీటిలో ఆస్తి పన్ను ఆధారంగా చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూలు, భీమిలి మండలం కొత్తవలస గ్రామంలోని సర్వే నంబర్ 73లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి వీఎంఆర్‌డీఏకు అప్పగింత ప్రధానమైనవి. కాగా చెత్తపన్నును పూర్తిగా రద్దు చేయడంతోపాటు పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించాలని సీపీఎం కార్పొరేటర్ బి. గంగారావు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa