ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. కమలాపురం నియోజకవర్గం చెన్నూరుకు చెందిన మహిళకు ఏడాది కిందట వివాహమైంది. భర్తతో విభేదాలతో దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మహిళతో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరూ ఇటీవల లేచిపోయి శ్రీకాళహస్తిలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం వేంపల్లె పోలీసులను ఆశ్రయించి, రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.