మైసూరులో రిటైర్డు టీచర్ సత్యనారాయణ 2019లో ఓ షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొన్నాడు. ఒక్కోటి రూ.30 కాగా మొత్తం రూ.90. కానీ వ్యాపారి రూ.110 వసూలు చేశాడు. ఎందుకు ఎక్కువ తీసుకున్నావని టీచర్ ప్రశ్నించగా అతడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో సత్యనారాయణ వ్యాపారిపై కేసు వేసి రూ.61వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు.మూడేళ్లపాటు జరిగిన విచారణలో వ్యాపారి చేసింది తప్పని అతనికి కోర్టు రూ.6,020 జరిమానా విధించింది.