యూపీలోని మధుర జిల్లా మీనానగర్లో దారుణం జరిగింది. కొన్నాళ్లుగా చమన్ ప్రకాష్, రేఖ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేరే వ్యక్తితో రేఖకు ఎఫైర్ ఉందని చమన్ అనుమానించేవాడు. సోమవారం కూడా ఈ విషయంపై ఇద్దరికీ గొడవ జరిగింది. కోపంలో భర్తపై రేఖ పెట్రోల్ పోసి నిప్పటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చమన్ చనిపోయాడు. కోసికల స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.