తన ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాను జనసేనలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇటువంటి దుష్ప్రచారం తనను బాధిస్తోందన్నారు. బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. చేనేతపై మంచి ఉద్దేశంతో పవన్ పెట్టిన ట్వీట్‌కు తాను స్పందించానన్నారు. తనపై వస్తున్న దుష్ప్రచారంపై సీఎం జగన్‌తో త్వరలో చర్చిస్తానని వెల్లడించారు.