బెంగళూరులో వ్యభిచారిగా చేసిన చంద్రకళతో సిద్ధలింగప్పకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తాను ఏ విధంగా ఈ వృత్తిలోకి వచ్చిందో లింగప్పకి చెప్పింది చంద్రకళ. తర్వాత ఇద్దరూ కలిసి ఆమెను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించిన వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. అలా మే, జూన్ నెలల్లో ఐదుగురు మహిళలను చంపేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.