ఏపీలో వివాదాస్పదంగా మారిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బుధవారం చేరింది. అది నిజమైనదా, మార్ఫింగ్ చేశారా అనే విషయం ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చనుంది. దీనిపై ఎంపీ అభిమానులు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. దీనిపై ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య రగడ ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa