ఛారిటబుల్ ట్రస్టులు 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 18,800 కోట్ల రూపాయల పన్ను మినహాయింపులను పొందాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో రిజిస్టర్ కాని ట్రస్ట్‌లు 21వేలకుపైగా ఉన్నాయని తెలిపింది. అలాగే 347 ట్రస్టులు, విదేశీ సహకార నియంత్రణ చట్టం ప్రకారం నమోదు కానప్పటికీ, విదేశీ విరాళాలు పొందాయని సోమవారం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో కాగ్ వెల్లడించింది.