నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పురిణి గ్రామ పంచాయతీలో సర్పంచ్ మైనంపాటి స్వాతి ఆధ్వర్యంలో బుధవారం ఆజాధీ కా అమృత్ మహోత్సవం పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ ఆగస్టు 15 కి తమ ఇంటి పైన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాండ్ర శ్రీనివాసులు, అల్లూరు మండలం మాజీ ఉపాధ్యక్షులు తాండ్ర మల్లికార్జున, గ్రామ పంచాయతీ కార్యదర్శి బేబీ శిరోమణి, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.