ఉక్రెయిన్పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెంట్రల్ ఉక్రెయిన్లో రష్యా దాడులు చేయడంతో 13 మంది ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ వాలెంటిన్ రెజ్నిచెంకో తెలిపారు. మరో వైపు మార్గానెట్స్లో జరిగిన దాడుల్లో కూడా చాలా మంది ప్రాణాలు విడిచారని కథనాలు వెలువడుతున్నాయి. రష్యా తన దాడులను రాత్రి వేళల్లోనే చేపడుతోందని, అది సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.