టెన్నిస్ క్రీడలకు సెరెనా విలియమ్స్ గుడ్ బై చెప్పారు. ప్రపంచ టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ క్రీడామణుల్లో ఆమె ఒకరు. పదునైన షాట్లతో, పవర్ ఫుల్ స్ట్రోక్స్ తో ఆమె తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత అయిన అమెరికాకు చెందిన ఈ నల్ల కలువకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ ప్రియులను అలరించిన సెరెనా కీలక ప్రకటన చేసింది. టెన్నిస్ కు దూరమవుతున్నానని ప్రకటించింది. దీన్ని తాను రిటైర్మెంట్ గా చెప్పనని... టెన్నిస్ కు దూరంగా ఉంటూ తన బిజినెస్, రెండో సంతానం విషయాలపై దృష్టి సారిస్తానని చెప్పింది. టెన్నిస్ కు దూరంగా వెళ్తున్నానని... తన జీవితంలోని ఇతర కార్యకలాపాల వైపు పూర్తిగా మళ్లుతున్నానని తెలిపింది. వచ్చే నెలలో సెరెనా 41వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
ప్రస్తుతం సెరెనా టొరంటో నేషనల్ ఓపెన్ లో ఆడుతోంది. ఆ తర్వాత ఈ నెల 29న న్యూయార్క్ లో ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్ లో ఆడబోతోంది. ఇదే ఆమె చివరి టోర్నీ కాబోతోంది. తన సొంత దేశం అమెరికాలో తన కెరీర్ కు ముగింపు పలకబోతోంది.దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయ స్థాయిలో పెరుగుతున్నాయని.. అయితే చాలా కేసుల్లో లక్షణాలు తక్కువగా ఉంటున్నాయని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతానికి ఆందోళనేదీ అవసరం లేదని ప్రకటించారు. ఢిల్లీలో ఆదివారం రోజున కొత్తగా 1,372 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు ఏకంగా 17.85 శాతంగా నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. అంటే పరీక్షలు చేసిన ప్రతి ఆరుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. సోమవారం రోజున ఢిల్లీలో 2,423 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 14.97 శాతంగా నమోదైంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఏయే చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తున్నాం. చాలా వరకు కేసుల్లో లక్షణాలు తక్కువగా ఉంటుండటం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.