పదవీ కాలం పూర్తవ్వడంతో తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం భారత ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలగనున్నారు. వెంకయ్య స్థానంలో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌కఢ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బుధవారం వెంకయ్యనాయుడు పార్లమెంటు ఆవరణలో సీతా అశోక మొక్కను నాటారు. భారతీయ సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సీతా అశోక మొక్కకు ఔషధ గుణాలున్న చెట్టుగానూ గుర్తింపు ఉంది. రాజ్యాంగ బద్ధ పదవి నుంచి దిగిపోతున్న నేపథ్యంలోనే వెంకయ్య అరుదైన ఈ మొక్కను పార్లమెంటు ఆవరణలో నాటారు.