కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే ఆధారంగానే గత ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఎవరికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పార్టీ నేతలకు సూచించారు. మునుగోడు బైపోల్ పై చర్చించేందుకు గురువారం మూడు కీలక సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది.