మన హిందూ సంప్రదాయంలో ప్రతి పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. తమ తోబుట్టువులకు రక్షణగా, అండగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తుంటారు. సోదరీమణులు సోదరుని మణికట్టు మీద రాఖీ కడితే చెడు నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం. దానికి బదులుగా సోదరులు వారి సోదరీమణులకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa