మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్త్రీ శక్తి కార్యక్రమం టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ప్రారంభించారు. మొదటి బ్యాచ్ లో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు పూర్తి చేసిన 70 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. మహిళల స్వయం ఉపాధి కోసం ఉచితంగా టైలరింగ్ మెషీన్లు అందజేశారు. మహిళలకి అండగా ఉండటమే టీడీపీ లక్ష్యం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు టీడీపీ పార్టీ ప్రయత్నిస్తుందని, ప్రజల అవసరాలు తీర్చడానికి ముందుంటాం అని తెలిపారు.