వైసీపీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజాన్ని దాచి గోరంట్ల మాధవ్ ని కాపాడే ప్రయత్నం చేసారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చేమ్ నాయుడు ఆరోపించారు. అయన మాట్లాడుతూ..... ఫార్వర్డ్ చేసిన వీడియోలే ఉన్నాయని ఒరిజినల్ వీడియో దొరికితేనే తప్ప నిగ్గుతేల్చలేమని నిస్సహాయత వ్యక్తం చేసారు.
ఏపీ పోలీస్ తలచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం సులభమే. లేదు నిజాన్ని తేల్చడం కష్టం అన్నట్టయితే... మీ వల్ల కాదు అనుకుంటే కేసును సిబిఐకి ఇచ్చే దమ్ముందా? అదైనా చెప్పండి అని ప్రశ్నించారు.