వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంభందించిన న్యూడ్ వీడియో ఫేక్ అంటూ అనంతపురం పోలీస్ బుధవారం మీడియా సమావేశం ద్వారా తెలియజేయడం ఐనది. ఇది జరిగిన తర్వాత ఎంపీ మీడియా ద్వారా టీడీపీ నాయకులను దుర్భాషలాడం జరిగింది.
దీనిపై స్పందించిన తెలుగు యువత నాయకులూ మాట్లాడుతూ....నగ్న వీడియో కాల్ తో ఎంపీ పదవినే అగౌరవపరచిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనకు తానే నిర్దోషి అని సర్టిఫికెట్ ఇచ్చుకున్నదే కాకుండా తెలుగుదేశం అధినేత గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు, లోకేశ్ గార్లపై అసభ్య భాషలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్న వైసీపీ డర్టీ ఎంపీ మాధవ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.