మంగళగిరి నియోజవర్గంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సంజీవని ఆరోగ్య రథాన్ని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ప్రారంభించారు . దుగ్గిరాల మండలంలోని అన్ని గ్రామాల్లో సంజీవని ఆరోగ్య రథం వైద్య సేవలు అందించనుంది.
త్వరలోనే మంగళగిరి, తాడేపల్లి లో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తాం. 200 రకాల రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేస్తాం అని తెలియజేసారు.