రొళ్ల: హెచ్టీ హళ్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ వైస్ ఎంపీపీ బండి మారెప్ప (60) బుధవారం మృతి చెందారు. ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ ఈరన్న 2నిమిషాలపాటు మౌనం పాటించారు. రాష్ట్ర వక్కళిక కన్వీనర్ పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, మాజీ సర్పంచులు సంతాపం తెలిపిన వారిలో అదేవిధంగా సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గురుమూర్తి ఉన్నారు.