ఉరవకొండ: స్థానిక 10వ వార్డు భద్రప్ప బావి వీధిలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం సుప్రభాత సేవ, స్వస్తి పుణ్యాహవచన, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి మహిళలు ప్రత్యేక కలశములతో ఆలయానికి ఊరేగింపుగా వెళ్లారు. ఆలయం వద్ద విశేష పుష్పాలతో అలంకరించిన వాహనంలో భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామిని కొలువుదీర్చారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కళ్యాణోత్సవ వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.