రాఖీ పండుగ సందర్భంగా ఆగ్రా లో ఓ స్వీట్ షాప్ యజమాని ప్యూర్ గోల్డ్ ఘెవార్ స్వీటును తయారుచేసాడు. మరి ఆ స్వీట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పాలు, నేయ్యి, పండి, చెక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో స్వీట్ తయారు చేసి దానిపై 24 క్యారెట్ల బంగారు పూత వేశారు. ఇలా తయారు చేసిన గోల్డ్ స్వీట్ ధర కేజీ రూ. 25వేలు. కాగా.. స్వీట్ షాప్‌కు వచ్చిన కస్టమర్లు బంగారు పూతతో మెరిసిపోతున్న ఆ స్వీట్ ను చూసి ముచ్చటపడుతున్నారు.