బీజేపీ కూటమిలో నితీశ్ కుమార్ సౌకర్యవంతంగా లేనందునే ప్రత్యర్థి కూటమిలో చేరారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ పరిణామాలు రాష్ట్రానికే పరిమితమన్న ఆయన.. జాతీయ స్థాయిలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 2017 నుంచి 2022 వరకు నీతీశ్ కుమార్ బిజెపితో ఉన్న ఎన్నడూ సంతోషంగా ఆయన లేరు. అందుకే మహాకూటమితో ప్రయోగం చేద్దామని భావించి ఉండవచ్చు అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.