కర్నూల్ జిల్లాలో వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలాయి. దీంతో కారులోని వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఎవరికి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత వైఎస్ విజయమ్మ మరో కారులో హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు.