ఒడిశాలోని రాయగడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ భారీ అల్యూమినియం రిఫైనరీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ ముద్రా అల్యూమినియం సుమారు రూ.42 కోట్లతో అల్యూమినియం రిఫైనరీ, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. అదానీ గ్రూపునకు అనుమతి మంజూరు చేసినట్టు ఒడిశా సీఎం కార్యాలయం ట్విట్టర్లో ప్రకటించింది. ఈ ప్లాంట్ 4 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో ఉండనుంది.